భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ ఇకలేరు
- August 15, 2018
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ అజిత్ లక్ష్మణ్ వాడేకర్ (77) కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్లోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1941 ఏప్రిల్ 1న బొంబాయిలో జన్మించిన వాడేకర్.. 1958లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. 1966లో భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఆ తరువాత జట్టులో తనదైన శైలీ ఆటతో రాణించాడు. భారత జట్టు తరఫున మొత్తం 37 టెస్టులలో ప్రాతినిధ్యం వహించి 2113 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ మరియు 4 అర్థ్ సెంచరీలు ఉన్నాయి. 1974లో ఇంగ్లండ్‌లో పర్యటించిన జట్టుకూ కెప్టెన్సీ వహించిన ఆయన ఆ సిరీస్‌లో జట్టు మూడు టెస్టుల్లోనూ ఓడటంతో రిటైర్మెంట్ ప్రకటించారు. 1990లో అజహరుద్దీన్ కెప్టెన్ ఉన్న సమయంలో వాడేకర్ భారత క్రికెట్ జట్టు కోచ్ గా.. ఆ తరువాత సెలెక్షన్ కమిటీ చైర్మెన్ గా పనిచేశారు. అజిత్ వాడేకర్ మృతిపట్ల పలువురు క్రికెటర్లు సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..