వీకెండ్‌లో ఎంగేజ్‌మెంట్ పార్టీ ప్లాన్ చేసిన ప్రియాంక
- August 15, 2018
ఎట్టకేలకు ఓ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంకచోప్రా. కొద్దిరోజుల కిందట అమెరికాలోని తన ఫ్రెండ్స్ సమక్షంలో సింగర్ నిక్ జోనాస్‌తో నిశ్చితార్థం జరిగినట్టు వెల్లడించింది. దీంతో ఈనెల 18న తమ ఫ్రెండ్స్ కోసం ముంబైలో ఘనంగా పార్టీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫంక్షన్ కోసం నిక్ ఫ్యామిలీ సభ్యులు ఇండియా రాబోతున్నారని, వాళ్ల కోసం ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌ను బుక్ చేసిందట పీసీ. ఆ రోజే మీడియా ముందు తన మ్యారేజ్ గురించి ప్రకటన చేయనుంది.
ఇక ప్రియాంకచోప్రా ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని బయటపెట్టింది ప్రియాంకచోప్రా. మంగళవారం రాత్రి ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా తన నివాసంలో ఓ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి పీసీతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భం గా తన పెళ్లి గురించి బయటపెట్టినట్టు సమాచారం. నిక్ తన చేతి వేలికి తొడిగిన డైమండ్ ఉంగరాన్ని చూపించింది. ఆ రింగ్ విలువ మన కరెన్సీలో అయితే దాదాపు కోటి రూపాయలకు పైనే!
ఇందులో నాలుగు క్యారట్ల వజ్రాలు ఉన్నాయట. తన బర్త్ డే ముందు ప్రియుడితో నిక్‌తో కలిసి లండన్ కి వెళ్లింది ప్రియాంక. అమెరికన్ జ్యువెలరీ సంస్థ టిఫనీ అండ్ కో షాప్‌లో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆ ఒక్క రోజు షాప్‌కి కస్టమర్లు రాకుండా క్లోజ్ చేయించి మరీ, అన్నీ పరిశీలించి డైమండ్ రింగ్‌ని నిక్ ఎంపిక చేసినట్లు హాలీవుడ్ వర్గాలు చెబుతున్నమాట.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







