కేరళ:తప్పించుకునే మార్గం లేదు.. కాపాడండి ప్లీజ్
- August 16, 2018
భారీ వర్షలకు కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ప్రకృతి ప్రకోపానికి జన జీవనం అస్థవ్యస్థమైంది. సహాయక బృందాలు చర్యలు చేపడుతున్నప్పటికీ రాష్ట్రంలోని కొంత భాగం ఇంకా నీటిలోనే ఉంది.
ఓ వ్యక్తి తన ఇల్లు నీటిలో మునిగిపోయిందని, రెండో ఫ్లోర్‌కి కూడా నీరు రావడంతో పీకల్లోతు నీటిలో మునిగిపోయానని సెల్పీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దయచేసి నన్ను కాపాడండి అంటూ రాష్ట్ర అధికారులకు విజ్ఞప్తి చేశాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ సత్వర చర్యలు తీసుకుంటున్న దాఖలాలేవీ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
కేరళ వాసులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారని, వారందరిని వరద భారి నుంచి కాపాడమంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. తామెంత డేంజర్‌లో ఉన్నామో తెలిపేందుకే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానని తెలిపాడు. కొన్ని రోజుల పాటు భవనం ఇలాగే నీటిలో ఉంటే గోడలు నాని ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని బాధితుడు తెలిపాడు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







