కేరళకు వారంరోజులపాటు ఉచిత కాల్స్, డాటా సేవలను ప్రకటించిన టెలికాం సంస్థలు

- August 17, 2018 , by Maagulf
కేరళకు వారంరోజులపాటు ఉచిత కాల్స్, డాటా సేవలను ప్రకటించిన టెలికాం సంస్థలు

కేరళ:పదిరోజులుగా వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు తమ వంతు సహాయం చేసేందుకు టెలికాం దిగ్గజాలు ముందుకొచ్చాయి. వారం రోజులపాటు ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఉచిత కాల్స్‌, డాటా సేవలను అందిస్తున్నట్టు రిలయెన్స్‌ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌లు ప్రకటించాయి. అలాగే పోస్ట్‌పె​యిడ్‌ కస్టమర్లు చెల్లించాల్సిన బిల్లులకు గడవు తేదీని పెంచినట్టు టెలికాం సంస్థలు తెలిపాయి. ఎయిర్‌ టెల్‌ తనవంతుగా 30 రూపాయల టాక్‌టైమ్‌.. వారం రోజులపాటు 1 జీబీ డాటా ప్రకటించింది. అంతేకాదు వరదలతో విద్యుత్ సరఫరా లేక ఇబ్బందిపడుతున్న ప్రాంతాలకు తమ ఎయిర్టెల్ స్టోర్లలో మొబైల్ ఛార్జింగ్ సదుపాయం ఏర్పాటు చేశామని ఇందుకోసం.. త్రిసూర్‌, కాలికట్‌, మలప్పురం, కన్నూర్‌, త్రివేంద్రం, ఎర్నాకులం వంటి ప్రాంతాల్లో హెవీ స్టోరేజీ బ్యాటరీలు అందుబాటులో ఉన్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. ఇదిలావుంటే కేరళలో జల విలయం కొనసాగుతోంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడ్తున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క పలక్కడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో నిన్న(గురువారం) ఒక్కరోజే ఐదుగురు మరణించారు. ఇప్పటివరకు 87 మంది మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక రాష్ట్ర ముఖ్యమంతి పినరయి విజయన్‌ ఇప్పటికే రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com