సౌదీ అరేబియా:భారతీయులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు
- August 17, 2018
రియాద్:తమ దేశంలో భారతీయులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సౌదీ రాయబారి బిన్ మొహ్మద్ అల్సటీ శుక్రవారం వెల్లడించారు. హాస్పిటాలిటీ, టూరిజం, ఐటీ రంగాల్లో పనిచేసేందుకు నైపుణ్యమున్న భారతీయులకు అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పశ్చిమ ఆసియాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయని వస్తున్న వార్తలు అవాస్తవమైనవని ఖండించారు.
ఖిద్దియా ఎంటర్టైన్మెంట్ సిటీ, నియోమ్ ఎకనామిక్ జోన్ వంటి ప్రతిష్టాత్మకమైన మెగా ప్రాజెక్టులను 2030లోపు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈనేపథ్యంలో నైపుణ్యమున్న భారతీయులుకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అన్నారు. అంతేగాకుండా, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని యువరాజు మొహ్మద్బిన్ సుల్తాన్ ఆదేశించారని బిన్ మొహ్మద్ తెలిపారు. టాటా, రిలయన్స్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, షపూర్జీ పలోన్జీ వంటి సంస్థలు సౌదీలోనూ విస్తృత కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అన్నారు. దాదాపు 400 కంపెనీల నిర్వహణకు లైసెన్సులు మంజూరు చేసినట్టు సౌదీ అరేబియా జనరల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ వెల్లడించింది.
మక్కా నుంచి మదీనా వరకు 450కిలోమీటర్ల దూరంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం, జెడ్డాలో విమానాశ్రయం నిర్మాణం పనులు త్వరలో చేపడతామని అన్నారు. సౌదీ అరేబియాలో 32 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని, 2016-17లో ఇరుదేశాల మధ్య 25బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగిందని అల్సటీ తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







