కేరళకు తక్షణ వరద సాయం రూ.500కోట్లు..మోదీ ప్రకటన
- August 17, 2018
కొచ్చి:వరదలతో విలవిల్లాడిన కేరళ రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.500 కోట్లు ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో వెల్లువెత్తిన వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ పి. సదాశివం, సీఎం పినరయి విజయన్, రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖరన్ లతో సమీక్షించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. అనంతరం కేరళ గవర్నర్, సీఎం, కేంద్రమంత్రితో కలిసి ప్రధాని ఏరియల్ సర్వే కోసం ఐఎన్ఎస్ గరుడ ప్రత్యేక హెలికాప్టరులో బయలుదేరారు. నావల్ బేస్ లోనే ప్రధాని వరద పరిస్థితిని సమీక్షించారు. ఇడిన్ జిల్లలం నుంచి కావుభాగం వరకు రోడ్డు వరదనీటిలో మునగడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కేరళలో 1568 సహాయ శిబిరాల్లో రెండులక్షలమందికి ఆశ్రయం కల్పించామని సీఎం విజయన్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







