రాహుల్ అధ్యక్షతన వార్రూమ్లో కీలక సమావేశం
- August 18, 2018
ఢిల్లీ: రాహుల్ గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వార్రూమ్లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్లు, సీఎల్పీ నేతలు, రాష్ట్రాల ఇన్చార్జ్లు హాజరయ్యారు. రాఫెల్ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, కేరళలో సహాయక చర్యలపై కాంగ్రెస్ నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీ పెద్ద దోపిడీ దారుడని మండిపడ్డారు. రాఫెల్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణను ఫణంగా పెట్టి రిలయన్స్ కంపెనీకి దోచిపెట్టారని అన్నారు. బీజేపీ అవినీతిని బయటపెట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాఫెల్ కుంభకోణంపై అక్టోబర్లో కరపత్రాలను పంచుతామని రఘువీరా తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







