యూఏఈ:కేరళ కోసం ఎమర్జెన్సీకమిటీ
- August 18, 2018
యూఏఈ:యూఏఈ అభివృద్ధిలో కేరళ ప్రజల భాగస్వామ్యం ఉందని, ఆ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన ప్రత్యేక బాధ్యత తమపై ఉందని యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయద్ అలీ నహ్యాన్ అన్నారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు జాతీయ స్థాయిలో ఓ ఎమర్జిన్సీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా ఎమిరేట్స్ రెడ్ క్రాస్ క్రెసెంట్ (ఈఆర్సీ) ఉంటుందని, ఇందులో పలు ఎన్జీవోలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ ఆపద సమయంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఎమిరేట్స్ ప్రజలు, ప్రవాస భారతీయులు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. కేరళలో ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేని వర్షాలు కురుస్తున్నాయి. బక్రీద్ జరుపుకోవాల్సిన సమయంలో ఇలాంటి ఘోరవిపత్తు వచ్చిందని, ఇలాంటి సమయంలో బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







