అమెరికాలో తెలుగు వాసి మృతి
- August 19, 2018
అమెరికాలో మరో తెలుగు వాసి మృతి చెందాడు. పశ్చిమగోదావరి దెందులూరు మండలం పెరుగ్గూడెం గ్రామానికి చెందిన బోళ్ల వీర వెంకట సురేష్(35) మృతి చెందాడు. సురేష్ చెన్నైలో బీటెక్ పూర్తి చేసి అక్కడే కొంతకాలం పని చేశాడు. అనంతరం హైదరాబాద్ లోని టీసీఎస్ సంస్థలో పని చేసాడు. రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లి మేరీల్యాండ్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ ఆదివారం ఉదయం కారులో సురేష్ చనిపోయి ఉన్నాడు. స్నేహితులు సురేష్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కొడుకు మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే సురేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







