వాట్సాప్:బ్యాకప్ ఇకపై అన్లిమిటెడ్
- August 19, 2018
ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్లతో ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. వినియోగదారుల అవసరాలను బట్టి కొత్త కొత్త మార్పులను చేస్తోంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ చేసిన ఒక ప్రకటన యూజర్లకు కాస్త చేదు గుళికలాంటిదే. ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారుల డేటా.. మెస్సేజ్‌లు, వీడియోలు, ఫొటోలు అన్నీ గూగుల్ డ్రైవ్‌లో ఎన్నాళ్లయినా బ్యాకప్ చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు వాట్సాప్ దీనిపై కోత విధించింది. కేవలం ఒక సంవత్సరం డేటా మాత్రమే డ్రైవ్‌లో భద్రపరుచుకోవచ్చు. అంటే ఏడాది క్రితం డేటా ఆటోమేటిగ్గా డ్రైవ్ నుంచి డిలీట్ అయిపోతుంది. నవంబర్ 12, 2018 తర్వాత ఈ ఆటోమేటిక్ డిలీట్‌ను ప్రారంభించనుంది. ఈ లోగా డ్రైవ్‌లో ఉన్న పాత డేటాను మీరు వేరే పద్ధతిలో భద్రపరుచుకోవాలి.
అయితే ఇక్కడ వినియోగదారులకు మరో శుభవార్త ఉంది. ఇప్పటివరకు గూగుల్ డ్రైవ్‌లో వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేసుకుంటే... మీకు ఇచ్చిన సాధారణ స్టోరేజీ (15 జీబీ)లో అంత మొత్తం డేటా వినియోగించినట్లు అయ్యేది. ఉదాహరణకు మీ వాట్సాప్ ఛాట్ బ్యాకప్ 500 ఎంబీ ఉందనుకోండి... మీ జీమెయిల్ స్టోరేజీలో అంత మొత్తం స్టోరేజీ సామర్థ్యం తగ్గిపోయేది. అయితే గూగుల్, వాట్సాప్ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ ఇబ్బంది తొలగిపోయింది. ఇకపై వాట్సాప్ ఛాట్ బ్యాకప్ మెమొరీని గూగుల్ స్టోరేజీలో లెక్కించదు. అంటే ఇకపై వాట్సాప్ బ్యాకప్ అన్‌లిమిటెట్ అన్నమాట.
‘‘నవంబరు 12, 2018 ఒక యూజర్‌కు గూగుల్ డ్రైవ్‌లో కేటాయించిన స్టోరేజ్ కోటా నుంచి వాట్సాప్‌నకు మినహాయింపు లభిస్తుంది. అయితే, ఏడాదికి మించి డ్రైవ్‌లో ఉన్న సమాచారం ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతుంది. దాన్ని గూగుల్ డ్రైవ్ నుంచి తొలగిస్తాం’’ అని తెలిపింది. అయితే ఐఫోన్లకు సంబంధించి వాట్సాప్ ఎలాంటి మార్పులు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!