యూఏఈ ఆమ్నెస్టీ సదుపాయం వినియోగించుకోండి:కె.టి.ఆర్
- August 19, 2018
హైదరాబాద్:యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ప్రకటించిన ఆమ్నెస్టీ అవకాశాన్ని ప్రవాసులు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కె.తారకరామారావు కోరారు. యూఏఈ ప్రకటించిన ఆమ్నెస్టీ గడువు ఆగస్టు-1 నుంచి అక్టోబరు-31 వరకు మూడు నెలల పాటు ఉందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ కారణాలతో యూఏఈలో అక్రమంగా ఉంటున్న వారు అక్కడి నిబంధనలకు అనుగుణంగా రెగ్యులరైజ్ చేసుకోవచ్చని, పత్రాలు లేకుండా ఉంటున్నవారు తెలంగాణకు తిరిగి రావచ్చన్నారు. అలా తిరిగొచ్చిన వాళ్లు రెండేళ్ల నిషేధకాలం ముగిసిన తరువాత తిరిగి యూఏఈకి వెళ్లొచ్చని తెలిపారు.
పాస్‌పోర్ట్ లేని ప్రవాసులు సైతం ఈ ఆమ్నెస్టీ సమయంలో భారత్‌కు తిరిగి రావొచ్చని చెప్పారు. స్వదేశానికి రావాలనుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ప్రారంభించామన్నారు. వివరాలకు యూఏఈ కాన్సులేట్‌లోని హెల్ప్‌డెస్క్ +00971565463903, [email protected] హైదరాబాద్‌లోని హెల్ప్‌లైన్ సెంటర్ ఫోన్ 94408 54433, ఈ-మెయిల్ [email protected] పై సంప్రదించాలని మంత్రి కోరారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..