యెమెన్:చిన్నారులను బలితీసుకున్నది అమెరికా బాంబే
- August 19, 2018
వాషింగ్టన్: యెమెన్‌లో శనివారం నాడు ఒక స్కూల్‌బస్‌పై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఉపయోగించిన బాంబు అమెరికా తయారు చేసినదేనని నిపుణులు స్పష్టం చేశారు. సౌదీతో కుదుర్చుకున్న ఆయుధాల ఒప్పందంలో భాగంగా ఈ బాంబును అమెరికా విక్రయించిందన్నారు. అమెరికా రక్షణ కాంట్రాక్ట్ సంస్థల్లో ఒకటైన లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన ఈ 227 కేజిల లాజెర్ గైడెడ్ ఎంకె-82 తరహా బాంబును ఈ నెల 9న సంకీర్ణ దళాలు ప్రయోగించటంతో పలువురు చిన్నారులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. 2016 అక్టోబర్‌లో ఒక కార్యక్రమంపై జరిగిన దాడిలో వినియోగించిన బాంబు వంటిదేనని నిపుణులు తేల్చిచెప్పారు. ఈ దాడిలో 155 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయాల పాలైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!