సియోల్:65 ఏళ్ల తరువాత ఏకమైన కుటుంబాలు
- August 20, 2018
సియోల్ : ఉభయ కొరియాలు విడిపోయిన దాదాపు 65 ఏళ్ల తరువాత సోమవారం నాడు ఉభయ కొరియాలలోని కొరియన్ కుటుంబాలు ఒక చోట కలిసాయి. దాదాపు ఆరున్నర దశాబ్దాల అనంతరం ఆత్మీయులను కలిసిన కొరియన్ కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందబాష్పాలు కన్పించాయి. ద.కొరియా ప్రస్తుత అధ్యక్షుడు మూన్జేఇన్ సైతం ఉభయ కొరియాల మధ్య విడిపోయిన కుటుంబంలోని సభ్యుడే కావటం విశేషం. వారంతా ఉత్తర కొరియాలోని హంగ్నామ్ పట్టణంలో నివశిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులను సుదీర్ఘ విరామానంతరం కలవటంపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ, ఉభయ కొరియాలలోని కొరియన్ కుటుంబాల కలయికలు తరచు నిర్వహిస్తుండాలని, పరస్పరం ఉత్తర ప్రత్యుత్తరాలతో, సందర్శనలతో సాన్నిహిత్యాన్ని మరింత పెంచుకోవాలని అన్నారు. ఈ కుటుంబాల పున్ణకలయిక కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు 57 వేల మందికి పైగా ద.కొరియా ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో అధికశాతం మంది నాటి కొరియన్ యుద్ధానికి ప్రత్యక్ష సాక్షులు కావటం విశేషం. సోమవారం నుండి దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ద.కొరియా నుండి 93 కుటుంబాలు పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ, అనారోగ్య కారణాలతో నలుగురు ద.కొరియా కుటుంబ సభ్యులు చివరి నిముషంలో తమ పర్యటనను వాయిదా వేసుకున్నారని రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. గురువారం నుండి మరో 88 గ్రూప్‌లు కలుస్తాయని, ఇందులో ద.కొరియాకు చెందిన 469 మంది, ఉ.కొరియా నుండి 128 మంది పాల్గొంటున్నారని సియోల్ ఏకీకరణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వివరించింది.
1985 నుండి ప్రారంభమైన ఈ ఏకీకరణ ప్రక్రియలో పాల్గొంటున్న వారిలో అధికశాతం మంది వయోవృద్ధులు కావటంతో తమ ఆత్మీయులను కలిసిన వెంటనే వారు భావోద్వేగానికి లోనవుతున్నారని ద.కొరియా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీరంతో 80 ఏళ్ల పైబడిన వారే కావటం విశేషం.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్‌పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







