'నాట్స్' నూతన కార్యవర్గం ఏర్పాటు

- August 20, 2018 , by Maagulf
'నాట్స్' నూతన కార్యవర్గం ఏర్పాటు

అమెరికా లో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. 2018-2020 కు నాట్స్ ప్రెసిడెంట్ బాధ్యతలను శ్రీనివాస్ బాబు మంచికలపూడికి అప్పగించింది. నాట్స్ కోశాధికారి గా ప్రస్తుతం సేవలు అందిస్తున్న శ్రీనివాస్ బాబు మంచికలపూడి నాట్స్ ప్రస్థానంలో పలు కీలక పదవులు అలంకరించడంతో పాటు ఆయన తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవడంతో నాట్స్ ప్రస్తుతం ఆయనకు ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. 

అలాగే బాపయ్య చౌదరి నూతి, చందు నంగినేని, రమేశ్ నూతలపాటి, శ్యాం నాళం, వంశీమోహన్ గరికపాటి, విజయ్ శేఖర్ అన్నే లకు వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలను నాట్స్ బోర్డు కట్టబెట్టింది. నాట్స్ కార్యదర్శిగా విష్ణు వీరపనేని, సంయుక్త కార్యదర్శిగా రంజిత్ చాగంటి, కోశాధికారిగా మదన్ పాములపాటి, సంయుక్త కోశాధికారిగా అజయ్ గోవాడ, కార్యనిర్వహక కార్యదర్శి( వెబ్)వంశీకృష్ణ వెనిగళ్ల, కార్యనిర్వహక కార్యదర్శి (మీడియా రిలేషన్స్) మురళీకృష్ణ మేడిచెర్ల కు నాట్స్ బోర్డు బాధ్యతలు కట్టబెట్టింది. వీరితో ప్రాంతాల వారీగా జోనల్ వైస్ ప్రెసిడెంట్లు, అంశాల వారీగా జాతీయ సమన్వయకర్తలను నాట్స్ బోర్డును ప్రకటించింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
వైస్ ప్రెసిడెంట్స్:

బాపయ్య చౌదరి నూతి (బాపు)

చందు నంగినేని

రమేష్ నూతలపాటి

శ్యామ్ నాళం

వంశీ మోహన్ గరికపాటి

విజయ్ శేఖర్ అన్నే

సెక్రటరీ: విష్ణు వీరపనేని

జాయింట్ సెక్రటరీ: రంజిత్ చాగంటి

ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా): మురళీకృష్ణ మేడిచెర్ల

ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (వెబ్): వంశీ కృష్ణ వెనిగళ్ల

ట్రెజరర్: మదన్ పాములపాటి

జాయింట్ ట్రెజరర్: అజయ్ గోవాడ

నేషనల్ కోఆర్డినేటర్స్:

జ్యోతి వనం (ఉమెన్స్)

కిశోర్ వీరగంధం (స్పోర్ట్స్)

కృష్ణ మల్లిన - హెల్ప్ లైన్)

నరేంద్ర పాములపాటి (సోషల్ మీడియా(

పవన్ వేమూరి (చాఫ్టర్స్ & మెంబెర్షిప్)

రామానాయుడు సూర్యదేవర (ఇండియా -లైసన్)

రమేష్ బెల్లం (సర్వీసెస్)

శ్రీనివాస్ కొమ్మినేని (పబ్లిసిటీ & మార్కెటింగ్)

శ్రీనివాస్ పిడికిటి (ఫండ్ రైజింగ్)

సురేష్ పూదోట (ప్రోగ్రామ్స్)

జోనల్ వైస్ ప్రెసిడెంట్స్:

NE: చంద్ర. ఎస్. కొణిదెల

SC: హేమంత్ కొల్ల

NC: కోటేశ్వర బోడిపూడి

NW: ప్రేమ్ గండమనేని

Mid Central: రాజేష్ వీధులమూడి

SW: రామ్ కొడితల

SE: శివ తాళ్లూరి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com