'ఐందవి' సినిమా ఆడియో విడుదల
- August 20, 2018
సన్నీ విన్నీ క్రియేషన్స్ పతాకంపై నందు, అనురాధా జంటగా నటిస్తున్న చిత్రం ఐందవి. హార్రర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఫణిరామ్ తూఫాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీ్ధర్ నిర్మాత. ఎస్‌ఏ అర్మాన్ సంగీతాన్ని అందించిన ఐందవి పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణిరామ్ తూఫాన్ మాట్లాడుతూ... కొందరు యువతీ యువకులు సరదాగా వెళ్లిన పర్యటన వాళ్లను ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోకి చేరేలా చేసింది అనేది ఐందవి కథాంశం. సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో చిత్రం సాగుతుంది. నేటి యువతకు కావాల్సిన అంశాలుంటాయి. చివరగా మూఢ నమ్మకాలను ఆశ్రయించొద్దు అనే సందేశాన్ని చెబుతున్నాం. పాటలు గీతా మాధురి, హరిణి, హేమచంద్ర లాంటి పేరున్న గాయనీ గాయకులు పాడారు. ఎస్‌ఏ అర్మాన్ మంచి మెలోడీలను అందించారు. హార్రర్ చిత్రాల్లో ఐందవి మరో స్థాయిని చేరుకుంటుందని నమ్మకముంది అన్నారు. నిర్మాత శ్రీ్ధర్ మాట్లాడుతూ.. నేటి ట్రెండ్‌కు తగినట్లు ఉండే సినిమా ఇది.
ఒక సక్సెస్ ఫుల్ ఫార్ములాను అనుసరించి ఈ సినిమాను నిర్మించాం. ఒక ఆసక్తికరమైన కథను ఐందవి చిత్రంలో చూస్తారు. అతీంద్రియ శక్తులు, హార్రర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు మా సినిమా బాగా నచ్చుతుంది. సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. అతిథిగా పాల్గొన్న నటుడు కాదంబరి కిరణ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్కేగౌడ్, సాయివెంకట్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దిలీప్, అవంతిక, చిత్రం శ్రీను, ఛత్రపతి శేఖర్, ప్రమీలా, బాలాజీ, కీర్తన తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: భరత్ సి.కుమార్, సాహిత్యం: ఏ.ఎస్.రావు, ఎడిటర్: మేగన శ్రీను.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







