తెలంగాణ:దర్గా వందల ఏళ్ల నుండి సర్వ మతాలకు వేదిక
- August 21, 2018
తెలంగాణ:వందల ఏళ్ల నుండి కులమతాలకు అతీతంగా నిలిచింది ఆ దర్గా. సర్వ మతాలకు వేదిక ఆ దర్గా.అదే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ సయ్యద్ అంకుషావలి రహ్మతుల్లా దర్గా.బక్రీద్ పర్వదినం ప్రారంభం కానున్న సంధర్బంగా ఈ దర్గా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచే ఈ దర్గా ప్రాంతంలో ఏ కులానికి చెందిన వారైనా అంతా సమానమే.ఆధ్యాత్మికతే ప్రధానం.విశ్వాసాలు వేరైనా ఆ ప్రార్ధనా మందిరంలో నిర్వహించే పూజలపై భక్తులకు ఎనలేని నమ్మకం.ఇక్కడ ప్రతి యేటా బక్రిద్ పండుగ రోజున ఉర్సు ఉత్సవాలు ప్రాంభమవుతాయి.
సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగిన బిజిగిరి షరీఫ్ దర్గాని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు పూర్వీకులు చెబుతారు.ఇది జమ్మికుంట పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది.విశ్వమానవ సమానత్వం చాటిన సోదరులు సయ్యద్ అంకుషావళి రహమతుల్లా అలై తదితరుల సమాధులు యిక్కడ వున్నాయి.అరబ్ దేశం నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ బిజిగిరి షరీఫ్ గ్రామానికి చేరుకుని దర్గాను నిర్మించుకున్నారు హజ్రత్ సయ్యద్ అంకుషావలి. ఆయన ప్రదర్శించిన మహిమల కారణంగా ప్రజలు సుఖశాంతుల జీవించారని చెబుతారు.నిష్టతో వేడుకుంటే భక్తుల కోర్కెలు అంకుషావలి తప్పక తీరుస్తారనేది ఇక్కడ భక్తుల నమ్మకం.
ఈ దర్గాలో బక్రిద్ పండుగ రోజున సాయంత్రం ఉర్సు ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.భక్తుల మొక్కులు చెల్లించటంతో ఉత్సవాలు ముగుస్తాయి.ప్రధాన ఘట్టమైన గంధలేపనం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతుంది.ఈ ఉర్సు ఉత్సవంలో మన రాష్ట్రం తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు పాల్గొంటారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







