ఈద్ అల్ అధా ప్రార్థనల్లో పాల్గొన్న యూఏఈ లీడర్స్
- August 21, 2018
యూఏఈ:యూఏఈ లీడర్స్, అలాగే పలువురు ప్రముఖులు దేశవ్యాప్తంగా జరిగిన ఈద్ అల్ అధా వేడుకల్లో పాల్గొన్నారు. ఈద్ అల్ అధా ప్రారంభం నేపథ్యంలో ఆయా ప్రముఖులు, ఆయా ప్రాంతాల్లో సందడి చేశారు. దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ మొహమ్మద్‌తో కలిసి షేక్ రషీద్ బిన్ సయీద్ మాస్క్ (జబీల్‌లో)లో ప్రార్థనలు నిర్వహించారు. అబుదాబీలో క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఈద్ ప్రార్థనల్ని అల్ బతీన్‌లోని సుల్తాన్ బిన్ జాయెద్ ది ఫస్ట్ మాస్క్‌లో ప్రార్థనల్ని నిర్వహించడం జరిగింది. అజ్మన్ రూలర్ షేక్ హుమైద్, షేక్ రషీద్ బిన్ హుమైద్ మాస్క్‌లో ఈద్ ప్రార్థనలు చేయడం జరిగింది. రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సాద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, ఖుజామ్‌లోని ఈద్ గ్రాండ్ ముసల్లాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన వెంట పలువురు ప్రముఖులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. గ్రాండ్ షేక్ జాయెద్ మాస్క్‌లో ఫుజారియా రూలర్ షేక్ హమాద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కి ప్రార్థనలు నిర్వహించారు. రూలర్స్ అంతా ఒకరికి ఒకరు ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







