1,616 సిరంజీలను వాడారు...పాప పుట్టింది..
- August 22, 2018
ఫీనిక్స్:ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తమ జంటకు సంతానం కావాలనుకున్నారు. అంతే ఐయూఐ పద్ధతిని ఎంచుకున్నారు. సరోగసీ లాంటి ఈ పద్ధతి ఫెయిల్ అయ్యింది. దీంతో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిని ఎంచుకుని నాలుగేళ్ల పాటు ప్రయత్నించారు.
ఎన్నోమార్లు ఐవీఎఫ్ కూడా విఫలమైంది. దాదాపు నాలుగేళ్ల తరువాత వారి ప్రయత్నం ఫలించగా, ఆ మహిళా జంటలో పాట్రీసియా అనే మహిళ నెల తప్పింది. కడుపులోని పిండం పరిస్థితి బాగాలేదని వైద్యులు తేల్చగా, దినదిన గండంగా గడుపుతూ, 9 నెలల పాటు గర్భాన్ని మోసింది. ఆపై ప్రసవించింది.
మహిళా జంటకు సంతానం కోసం ఐయూఐ, ఐవీఎఫ్ విధానాల్లో తాము వాడిన సిరంజీలను వైద్యులు పేర్చి మధ్యలో బిడ్డను ఫోటో తీశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా 1,616 సిరంజీలను వాడారు. ఈ సిరంజీల ద్వారా వీర్య కణాలను గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఇలా తాను తల్లి కావాలనే కోరిక తీరిందని పాట్రీసియా తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







