హోలీ ప్లేసెస్‌లో తొలిసారి ఫుడ్‌ ట్రక్స్‌ సేవలు

- August 22, 2018 , by Maagulf
హోలీ ప్లేసెస్‌లో తొలిసారి ఫుడ్‌ ట్రక్స్‌ సేవలు

మినా:తొలిసారిగా హోలీ ప్లేసెస్‌లో సౌదీ మహిళలు, పురుషులు నిర్వహిస్తున్న ఫుడ్‌ ట్రక్స్‌ సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుత హజ్‌ సీజన్‌లో ఫిలిగ్రిమ్స్‌కి సేవలందించే క్రమంలో స్థానిక ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి అనుమతివ్వాలని డిప్యూటీ మక్కా గవర్నర్‌ ప్రిన్స్‌ అబ్దుల్లా బిన్‌ బందర్‌, సెక్రెటేరియట్‌ ఆఫ్‌ హోలీ క్యాపిటల్‌కి ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. పాత ఫిక్స్‌డ్‌ ఫుడ్‌ స్టాల్స్‌కి అదనంగా 45 ఫుడ్‌ ట్రక్స్‌, హోలీ ప్లేసెస్‌లో రోమింగ్‌ చేస్తూ, ఫిలిగ్రిమ్స్‌కి ఆహార పదార్థాల్ని అందిస్తున్నాయి. మక్కా గవర్నర్‌ మహిళలకు హోలీ ప్లేసెస్‌లో వర్క్‌ చేయడానికి అనుమతిచ్చారని అఫాఫ్‌ అబ్దుల్‌ అజీజ్‌ అనే మహిళ చెప్పారు. ఈమె హాట్‌ డ్రింక్స్‌ని సెర్వ్‌ చేస్తున్నారు. ఆరిఫ్‌ ఒబైద్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ, ఫుడ్‌ ట్రక్‌లో తాను పనిచేస్తున్నాననీ, కాఫీని అందిస్తున్నామనీ, చాలామంది సెక్యూరిటీ మెన్‌ తమ ట్రక్‌ని విజిట్‌ చేసి, అరబ్‌ కాఫీ రుచి చూస్తున్నారని చెప్పారు. 

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com