ఖతారీలకు కొత్త వీసాల్లేవ్: బహ్రెయిన్
- August 22, 2018
బహ్రెయిన్:ఖతారీ జాతీయులకు కొత్త వీసాల జారీని నిలుపుదల చేస్తున్నట్లు బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. అయితే, బహ్రెయిన్‌లో విద్యనభ్యసిస్తున్నవారికి, ఇప్పటికే వీసా పొందిన ఖతారీలకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది వుండబోదని మినిస్ట్రీ తెలియజేస్తోంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ మరియు ఈజిప్ట్ 2017 జూన్ నుంచి ఖతార్‌తో డిప్లమాటిక్, ట్రాన్స్పోర్ట్, ట్రేడ్ ఒప్పందాల్ని రద్దు చేసుకున్న సంగతి తెల్సిందే. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో ఖతార్‌ని ఈ దేశాలు దూరం పెట్టాయి. భద్రతా చర్యల్లో భాగంగా ఖతారీ జాతీయులపై ఎంట్రీ వీసాల్ని జారీ చేస్తున్నట్లు బహ్రెయిన్ పేర్కొంది. మామూలుగా అయితే గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్‌కి చెందిన ఆరు దేశాలకు చెందినవారు జీసీసీ పరిధిలో కేవలం ఐడెంటిటీ కార్డుతో ప్రయాణం చేసే వీలుంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







