హజ్ యాత్రికుల సేవలో మున్సిపల్ అధికారులు
- August 22, 2018
సౌదీ అరేబియా:మక్కా మున్సిపల్ అధికారులు దైవసేవలో తరించిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా పవిత్ర యాత్రకు వచ్చే టూరిస్టుల కోసం ఈసారి ప్రత్యేకమైన సదుపాయాలు చేశారు. యాత్రికుల తక్షణావసరాలను గుర్తించి వేలాది మందికి ప్రత్యేకమైన బహుమానాల కిట్లను అందజేశారు. ఒక్కో కిట్లో ఎండను తట్టుకునేందుకు గొడుగు, వాటర్ బాటిల్, ప్రార్థన చేసుకునే రగ్గు, అల్లా మార్గాన్ని సూచించే వివిధ భాషల బుక్ లెట్స్ ఉంటాయి. ఇలా 26 వేల గిఫ్ట్స్ ను ఈసారి మక్కా అధికారులు అందజేయడం విశేషం. యాత్రికుల సేవ కోసం ఔత్సాహికులైన యువతీ యువకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సౌదీ యూత్ విజన్ టీమ్ పేరుతో 60 మంది యువతీయువకులు గిఫ్ట్స్ పంపిణీలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







