బహ్రెయిన్:తెలిసి చేసినా, తెలియక చేసినా అది నేరమే!
- August 23, 2018
బహ్రెయిన్:ప్రయాణీకులు తమకు తెలియకుండా నిషేధిత వస్తువులను రవాణా చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కస్టమ్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. బహ్రెయిన్‌లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ 2017లో 1,286 కాంట్రాబ్యాండ్ ఐటమ్స్‌ని స్వాధీనం చేసుకుంది. వీటిల్లో నార్కోటిక్ డ్రగ్స్, పిల్స్, జెమ్‌స్టోన్స్, పెరల్స్, వెపన్స్, అమ్యూనిషన్, ఆల్కహాల్, కరెన్సీస్, టొబాకో వంటివి కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో వున్నాయి. ఈ సందర్భంగా పలు అరెస్టులు జరిగాయనీ, అయితే అలా అరెస్టయినవారిలో చాలామందికి తాము అసలు వాటిని రవాణా చేస్తున్నామనే విషయం కూడా తెలియదని కస్టమ్స్ ఇన్స్పెక్షన్స్ అండ్ కస్టమ్స్ ఎఫైర్ డైరెక్టర్ జనరల్ జనరల్ అబ్దుల్లా హమాద్ అల్ కుబైసి చెప్పారు. ఈ నేపథ్యంలో నిషేధిత వస్తువుల అక్రమ రవాణాపై ప్రయాణీకుల్లో మరింత అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడ్తున్నట్లు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. అపరిచిత వ్యక్తులు ఇచ్చే ఎలాంటి వస్తువుల్నీ తమతోపాటు తీసుకెళ్ళరాదని ప్రయాణీకులకు సూచిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







