ప్రముఖ జర్నలిస్ట్‌ మృతికి ప్రధాని సంతాపం

- August 23, 2018 , by Maagulf
ప్రముఖ జర్నలిస్ట్‌ మృతికి ప్రధాని సంతాపం

న్యూఢిల్లీ : సీనియర్‌ జర్నలిస్ట్‌, రచయిత కుల్దీప్‌ నాయర్‌ మృతిచెందారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఆయన ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న సిల్‌కోట్‌లో 1923 ఆగస్ట్‌ 4లో జన్మించారు. లా డిగ్రీ పట్టాను దేశ విభజనకు ముందు లాహోర్‌ నుండి పొందారు. ' బిట్వీన్‌ ద లైన్స్‌' పేరుతో కాలమ్‌ దాదాపు 80 పత్రికలలో ప్రచురితమైంది. జర్నలిస్ట్‌గానే కాక మానవహక్కుల ఉద్యమకారుడిగగా కుల్దీప్‌ బాధ్యతలు నిర్వహించారు. 1990లో బ్రిటన్‌లో హైకమిషనర్‌ ఆఫ్‌ ఇండియాగా పనిచేశారు. 1997లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రచయితగా 15కు పైగా పుస్తకాలు రాశారు. ఆయన ఆత్మకథ 2012లో ప్రచురితమైంది. విభజన అనంతరం కమ్యూనిటీల మధ్య నమ్మకాలు కూలిపోవడాన్ని గురించి రచించారు. దేశ విభజన సమయంలో పంజాబ్‌ నుండి ఆయన బలవంతంగా ఢిల్లీకి చేరుకున్నారు. 
కుల్దీప్‌ నాయర్‌ తమ కాలానికి చెందిన మేధో దిగ్గజమని, నిర్భయమైన తన అభిప్రాయాలతో అనేక దశాబ్దాలుగా జర్నలిస్ట్‌గా కొనసాగారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన ఆయన చూపిన ధైర్యం, ప్రజలకు సేవచేయడం, మెరుగైన దేశం కోసం ఆయన చూపిన నిబద్ధత ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయని, ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com