'ఫేస్ బుక్' వినియోగదారులకు మరో షాకింగ్ న్యూస్..!

- August 23, 2018 , by Maagulf
'ఫేస్ బుక్' వినియోగదారులకు మరో షాకింగ్ న్యూస్..!

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్ 'ఫేస్ బుక్' డేటా చౌర్యం చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల అనుమతి లేకుండా.. పొలిటికల్ డేటా అనాలసిస్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా ఏకంగా 5 కోట్ల మంది ఖాతాదారుల డేటాను రహస్యంగా వినియోగించుకున్న వైనం కలకలం రేపింది. దీంతో ఫేస్ బుక్ లో డేటా భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దీంతో చాలామంది ఫేస్ బుక్ ఖాతాలను డిలీట్ కూడా చేసుకున్నారు.

ఇది మరువక ముందే మరో 'ఫేస్ బుక్' డేటా స్కాం వెలుగులోకి వచ్చింది. 'ఫేస్‌ బుక్‌' థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎంత ముప్పు ఉందో మరోసారి బయటపడింది. 'మై పర్సనాలిటీ' అనే థర్డ్ పార్టీ యాప్.. సుమారు 40లక్షల మంది యూజర్ల డేటాను దుర్వినియోగం చేసినట్లు ఫేస్‌ బుక్ విచారణలో తేలటంతో ఈ యాప్‌ ను ఫేస్‌ బుక్ తొలగించింది.

ఈ యాప్ 2012కు ముందు బాగా యాక్టివ్‌ గా ఉండేది. ఈ యాప్ ద్వారా తమ డేటాను పంచుకున్న సుమారు 40 లక్షల మంది యూజర్ల డేటా దుర్వినియోగం అయినట్లు సంస్థ తెలిపింది. దీంతో 'మై పర్సనాలిటీ అనే యాప్‌ ను ఫేస్‌ బుక్ నుంచి నిషేధిస్తున్నాం' అని ఫేస్‌ బుక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాం తర్వాత ఈ ఏడాది మార్చిలో వేలాది థర్డ్ పార్టీ యాప్స్ పై ఫేస్‌ బుక్ విచారణ జరిపింది. దీంతో అనుమానాస్పదంగా అనిపించిన 400 యాప్స్ ను తొలిగించారు. కాగా, యాప్స్ పై విచారణ కొనసాగిస్తామని ఫేస్‌ బుక్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com