ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో బంపర్ ఆఫర్ సేల్
- August 23, 2018
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఒక సేల్ తర్వతా మరో సేల్ నిర్వహిస్తూనే ఉంది. ఇటీవలే బిగ్ ఫ్రీడం సేల్ ముగిసింది. ఈ సేల్ ముగిసిన రెండు వారాల్లోనే ఫ్లిప్ కార్ట్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘సూపర్ర్ సేల్’ పేరుతో మరో సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్‌లో పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై, టీవీలపై, ల్యాప్‌టాప్‌లపై, రిఫ్రిజిరేటర్లపై ఆకర్షణీయమైన డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటిస్తుంది. ఆగస్టు 25 నుంచి ఈ సేల్ లైవ్‌లోకి వస్తుండగా.. ప్లస్ సభ్యులకు ఆగస్టు 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది.
* రెడ్‌మి 5ఏ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 25వ తేదిన మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌కు వస్తుంది.
* శాంసంగ్, ఎల్‌జీ, వర్‌పూల్ బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లపై 30 శాతం తగ్గింపు.
* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ (ఈఎంఐ ద్వారా జరిపే పేమెంట్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది).
* ల్యాప్‌టాప్‌లపై అదనంగా రూ.2వేలు తగ్గింపు.
* గానా ప్లస్‌కు 6 నెలల సబ్‌స్క్రిప్షన్, ఐక్సిగోలో విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి రూ.550 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్.
* బుక్‌మైషో ద్వారా సినిమా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి రూ.100 తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు కాస్త ముందుగా ఈ సేల్ అందుబాటులోకి రావడమే కాకుండా.. ఫ్రీ డెలివరీ, ప్రియారిటీ కస్టమర్ సపోర్టు కూడ లభించనున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







