'అప్పట్లో ఒకడుండేవాడు' - నారా రోహిత్...
- May 09, 2015
రీసెంట్ గా 'రౌడీఫెలో'తో పలకరించిన నారా రోహిత్ మరో చిత్రం ప్రకటించేసాడు. కథ నచ్చేసి...యాక్షన్ ప్రధానంగా సాగే మరో కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్‌తోపాటు శ్రీవిష్ణు మరో హీరో గా నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వశిష్ట మూవీస్ పతాకంపై హరి, సన్నీరాజు నిర్మిస్తున్నారు. జూన్ మొదటివారం నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. నిర్మాతలు మాట్లాడుతూ ''1992-1996 సంవత్సరాల మధ్య ఇద్దరు యువకుల జీవితాల్లో చోటు చేసుకొన్న కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. 'ప్రేమ ఇష్క్ కాదల్' చిత్రంలో రాయల్ రాజుగా నటించి మెప్పించిన శ్రీవిష్ణు ఇందులో మరో హీరో గా నటిస్తున్నారు''అన్నారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు నారా రోహిత్ ..మరో చిత్రం అసుర విషయానికి వస్తే... కెరీర్ లో చేసింది తక్కువ సినిమాలైనా..ప్రతి సినిమాలో విభిన్నపాత్రలో కనిపించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు నారా రోహిత్. అలాటిందే ఇప్పుడు ఓ విభిన్న గెటప్‌లో నటించిన 'అసుర' చిత్రం టీజర్ ను ఈ మధ్యనే విడుదల చేశారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









