కేరళకు భారీ విరాళం అందించిన డాక్టర్ బి.ఆర్.శెట్టి
- August 23, 2018
అబుదాబీ:అబుదాబీకి చెందిన వ్యాపారవేత్త డాక్టర్ బి.ఆర్.శెట్టి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన 40 మిలియన్ రూపాయల (2.1 మిలియన్ దిర్హామ్‌లు) చెక్‌ని ముఖ్యమంత్రికి అందజేశారు శెట్టి. ఇది కాకుండా ఇంతకు ముందు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్‌కి 5 మిలియన్ దిర్హామ్‌లను కేరళ రిలీఫ్ ఫండ్‌లో భాగంగా బిఆర్ శెట్టి అందజేయడం జరిగింది. యూఏఈ తరఫున 100 మిలియన్ డాలర్లను కేరళకు సహాయంగా అందజేసేందుకు సన్నాహాలు జరగగా, యూఏఈ సహాయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించిన దరిమిలా, బిఆర్ శెట్టి స్వయంగా కేరళ ముఖ్యమంత్రిని కలిసి తాజా సాయాన్ని అందించడం జరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో కేరళ ప్రజలు సంఘటితంగా వుండి పెను విపత్తుని ధైర్యంగా ఎదుర్కొన్నారని శెట్టి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







