విడాకుల కోసం 8000 బహ్రెయినీ దినార్స్‌ చెల్లించిన మహిళ

- August 24, 2018 , by Maagulf
విడాకుల కోసం 8000 బహ్రెయినీ దినార్స్‌ చెల్లించిన మహిళ

మనామా:ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు పొందేందుకుగాను 8000 బహ్రెయినీ దినార్స్‌ చెల్లించింది. హై షరియత్‌ కోర్టు, విడాకులు తీసుకోవాలంటే భర్త నుంచి తీసుకున్న డౌరీని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ ఆ మొత్తాన్ని చెల్లించడం జరిగింది. తొలుత డౌరీని తిరిగి చెల్లించడానికి ఆ మహిళ అంగీకరించలేదు. అయితే విడాకులు ఇవ్వాలంటే తాను ఇచ్చిన డౌరీని తిరిగివ్వాల్సిందేనని భర్త పట్టుబట్టడంతో, అతనికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. భర్తతో విభేదాలు ఏమాత్రం సద్దుమణిగే అవకాశాలు కన్పించడంలేదనీ, ఈ క్రమంలోనే తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని మహిళ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com