కాంగ్రెస్ గెలిస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చితీరతామంటున్న రాహుల్ గాంధీ
- August 24, 2018
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని అన్నారు రాహుల్ గాంధీ. ఇది ఏపీ ప్రజలకు తాను ఇస్తున్న హామీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని భారత ప్రభుత్వం వాగ్దానం చేసిందని గుర్తు చేసిన రాహుల్..ఆ వాగ్దానాన్ని తాను అంత తేలిగ్గా తీసుకోబోమని అన్నారు. బెర్లిన్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఏపీకి స్టేటస్ అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు దన్నుగా నిలుస్తున్న మోడీ..ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలను మాత్రం బలహీనపరుస్తున్నారని విమర్శించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







