‘నీవెవరో’:రివ్యూ

- August 24, 2018 , by Maagulf
‘నీవెవరో’:రివ్యూ

టైటిల్ : నీవెవరో
జానర్ : యాక్షన్ థ్రిల్లర్‌
తారాగణం : ఆది పినిశెట్టి, తాప్సీ పన్ను, రితీకా సింగ్‌, వెన్నెల కిశోర్‌
సంగీతం : అచ్చు రాజమణి, ప్రసన్‌
దర్శకత్వం : హరినాథ్‌
నిర్మాత : ఎంవీవీ సత్యానారాయణ, కోన వెంకట్‌

ఆది సౌత్ టాలెంట్ ఆర్టిస్ట్ లలో ముందుంటాడు. తాప్సి ఇండియన్ స్క్రీన్ మీద తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. మొదటి సినిమాతోనే ఇండియన్ సినిమా లవర్స్ ని ఆకట్టుకుంది రితికా సింగ్. ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ల ప్యాక్ తో వచ్చిన నీవెవరో మంచి అంచనాలతో రిలీజ్ అయ్యింది. మరి నీవెవరో అంటూ ఆది చేసిన ప్రయాణం ఏంత ఇంట్రెస్ట్ గా మారిందో చూద్దాం..

కథ:
కళ్యాణ్ స్వశక్తితో ఎదిగిన యువకుడు. బ్లైండ్ అయినా ఎవరి సాయం లేకుండా జీవితంలో గెలిచిన కళ్యాణ్ అంటే తన చిన్నప్పటి స్నేహితురాలు అను(రితికా సింగ్) కి చాలా ఇష్టం ఆ ఇష్టం ప్రేమగా మారి పెద్దల వరకూ వెళ్ళే లోపు కళ్యాణ్ వెన్నెల( తాప్సి) ని ఇష్టపడతాడు. వెన్నెల కున్న ఆర్దిక సమస్యలు తీర్చేందుకు కళ్యాణ్ ముందుకు వస్తాడు. ఇంతలో కళ్యాణ్ కి యాక్సిడెంట్ అవుతుంది. తను డిస్చార్చ్ అయ్యే టైంకి వెన్నెల కనిపించకుండా పోతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత జరిగిన ఆపరేషన్ లో కళ్యాణ్ కి కంటిచూపు వస్తుంది. చూపు వచ్చాక వెన్నెల కోసం వెతకడం మొదలు పెడతాడు. అమ్మానాన్న అను తో పెళ్ళి ఫిక్స్ చేస్తారు. ఎంగేజ్ మెంట్ రోజు వెన్నెల ఆచూకి తెలుస్తుంది. వెంటాడి పట్టుకునే లోపు మళ్ళీ మిస్ అవుతుంది. అందుకే వెన్నెల కోసం వెతకడం మొదలు పెడతాడు కళ్యాణ్ .. మరి వెన్నెల గురించి కళ్యాణ్ తెలుసుకున్న నిజాలేంటి..? అసలు వెన్నెల ఎందుకు మిస్ అయ్యింది అనేది మిగిలిన కథ..?

కథనం:
ఆది చేసిన ప్రతి పాత్రలోనూ ఒక కొత్తదనం కోసం తపించడం మొదటి సినిమా నుండి చూస్తూనే ఉన్నాం. ఆ ప్రత్యేకతే ఆదిని సౌతో మోస్ట్ వాంటెండ్ ఆర్టిస్ట్ ని చేసింది. నీవెవరో తో కూడా ఆది తన టాలెంట్ కి పరీక్ష పెట్టి ఆ పరీక్ష లో శభాష్ అనిపించుకున్నాడు. అంధుడిగా అతని నటన చాలా రియలిస్టిక్ గా సాగింది. ఎవరి జాలి కోసం ఎదురు చూడకుండా తన స్వశక్తితో ఎదిగిన కుర్రాడి జీవితంలో ప్రేమ చేసిన గాయాలు ఆసక్తిగా మలిచాడు దర్శకుడు హారినాథ్. కథలు ఫార్మెట్ గోడలను బద్దలు కొట్టుకొని కొత్త అనుభూతలు ప్రేక్షకులకు ఇవ్వడం మొదలు పెట్టాయి. అలాంటి కథే ‘నీవెవరో’. ఒక ఫీల్ గుడ్ కథతో మొదలైన కథ తీసుకున్న మలుపులు, మారుతున్న పాత్రల తీరు తెన్నుల ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.

తాప్సి పాత్ర ఈ సినిమా కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. ప్రేక్షకులు అంచనాలకు అందకుండా కథనాలను నడపడంలో దర్శకుడు విజయం సాధించాడు. ‘నీవెవరో’ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఈ కథలో అందంగా కనిపిస్తూ నెక్ట్స్ డోర్ గాళ్ గా మెప్పించిన రితికా ల మద్య స్నేహం, ప్రేమ చాలా ఎఫెక్టివ్ గా కనిపించాయి. సెకండాఫ్ లో ఇన్విస్టిగేషన్ ఎక్కడా బిగి సడలకుండా నడిపాడు దర్శకుడు. ఆదే సినిమాకి ఆయువు పట్టుగా మారింది. ‘నీవెవరో’ ఆడియన్స్ ని థ్రిల్ చేసే అంశాలు చాలా ఉన్నాయి. అందరూ ఇష్టపడే జీవితం హీరోది అయినా అతని లైఫ్ లో ప్రేమ సృష్టించిన అలజడిని చూపేందుకు దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు.

రితికా సింగ్ ప్రెండ్ గా, ఒక బలమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా తన రోల్ ని ప్లజెంట్ గా ప్రజెంట్ గా చేసింది. తులసి లౌడ్ మదర్ రోల్ కాస్త ఫన్ ని మరికాస్త సెంటిమెంట్ ని ఎఫెక్టివ్ గా చూపెట్టింది. కథలో చిక్కుముడులు ఒక్కోక్కటీ విప్పడం మొదలు పెట్టే ప్రయత్నంలోకి హీరో క్యారెక్టర్ వెళ్ళాక సినిమా కథనం స్పీడందుకుంది. తాప్సి చేసిన రోల్ ఒక సర్ ప్రైజింగ్ ప్యాక్టర్. ఆ రోల్ ని తాప్సి చాలా స్ట్రాంగ్ గా తెరమీదకు తీసుకువచ్చింది. వెన్నెల కిషోర్ చొక్కారావుగా నవ్వులు పూయించి, రిలీఫ్ పాయింట్ గా మారాడు. సప్తగిరి పంచ్ లు పేలాయి. ఒక సీరియస్ మూడ్ లో వెళతున్న కథనం లో జర్క్ రాకుండా కామెడీ టచ్ నివ్వడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

తాప్సి పాత్రలో ఎలాంటి కన్ ఫ్యూజన్స్ లేకుండా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రేమ మోసం అని తెలుసుకున్నాక అది వేటగా మారడానికి మద్య హీరో క్యారెక్టర్ లో వచ్చే మార్పులను ఆది చాలా బాగా తన క్యారెక్టర్ లో పలికించాడు. ఇక తాప్సి చేసిన పాత్రలలో ఇది చాలా భిన్నమైనది అనుకోవచ్చు. థ్రిల్లర్ కుండే క్వాలిటీస్ ని దెబ్బతీయకుండా కథనంలో హ్యుమర్ పండించడం లో సక్సెస్ అయ్యాడు దర్శకుడు . తాప్సి రోల్ రివీల్ అయ్యాక ఆక్యారెక్టర్ మీద వెన్నెల కిషోర్ వేసిన పంచ్ లు అదిరిపోయాయి. తప్పకుండా ఆది, తాప్సి ల నటన కు ఈ క్యారెక్టర్స్ పదును పెట్టాయి. ఆది హీరో ఇమేజ్ భ్రమలో పడకుండా ఆ క్యారెక్టర్ పరిథి ని దాటకుండా జాగ్రత్త పడ్డాడు. సెంకండాఫ్ నీవెవరోకి హైలెట్ గా మారింది. థ్రిల్లర్ కి ఉండే లక్షణాలను చెడగొట్టకుండా కథనంలో హ్యుమర్ ని మిక్స్ చేసిన తీరు ఆకట్టుకుంది.

 

--మాగల్ఫ్ రేటింగ్:2/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com