కువైట్:వర్క్‌ పర్మిట్స్‌ని రివ్యూ చేస్తున్న మేన్‌ పవర్‌ అథారిటీ

- August 24, 2018 , by Maagulf
కువైట్:వర్క్‌ పర్మిట్స్‌ని రివ్యూ చేస్తున్న మేన్‌ పవర్‌ అథారిటీ
కువైట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌, వర్క్‌ పర్మిట్స్‌ని రివ్యూ చేస్తోంది. గడువు తీరిన, వినియోగంలో లేని వర్క్‌ పర్మిట్స్‌ని క్యాన్సిల్‌ చేయడమే ఈ రివ్యూ ఉద్దేశ్యం. ఎంప్లాయ్‌మెంట్‌ సెక్టార్‌ ఇప్పటికే పర్మిట్స్‌ని క్యాన్సిల్‌ చేసే పని ప్రారంభించిందనీ, రెసిఎడెన్సీ ఎఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌ అలాగే ఇంటీరియర్‌ మినిస్ట్రీ నుంచి డేటాను పరిశీలించి ఈ కార్యక్రమం చేపడ్తోందని సమాచారం. ఇదిలా ఉండగా, ఫైనాన్స్‌ మినిస్టర్‌ నయెఫ్‌ అల్‌ హజ్రాఫ్‌, 4 శాతం ఉద్యోగాల్ని హ్యాండిక్యాప్డ్‌ వారికి ఇచ్చేందుకోసం తీసుకున్న నిర్ణయంలో వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు. సివిల్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎవర్నయినా నామినేట్‌ చేసే క్రమంలో వారిని ముందుగా డిపార్ట్‌మెంట్స్‌కి ట్రయల్‌ పీరియడ్‌ నిమిత్తం పంపుతుందని చెప్పారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com