వెదర్ రిపోర్ట్: 48 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత
- August 24, 2018
యూఏఈలో అత్యధిక ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరుకుంది. పగటి వేళల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం రానున్న రోజుల్లోనూ ఈ వేడి వాతావరణం కొనసాగనుంది. దేశంలో అత్యధికంగా రికార్డ్ అయిన ఉష్ణోగ్రత 48.5 డిగ్రీల సెల్సియస్. గాలుల వేగం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది గంటకు 38 కిలోమీటర్ల వేగం వరకు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. ఆదివారం పలు చోట్ల హ్యుమిడిటీ ఎక్కువగా నమోదవుతుంది. కొన్ని చోట్ల మేఘాలూ కనిపిస్తాయి. సోమవారం సైతం వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. వేడి వాతావరణం, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదురవుతాయి. మంగళవారం సైతం వాతావరణంలో పెద్దగా మార్పులుండవు. అయితే గాలుల వేగంలో మాత్రం మార్పులు చోటు చేసుకోవచ్చు. అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ సీలలో మోడరేట్ వాతావరణం కన్పిస్తుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







