మక్కా గ్రాండ్‌ మాస్క్‌ వద్ద వ్యక్తి ఆత్మహత్య

- August 24, 2018 , by Maagulf
మక్కా గ్రాండ్‌ మాస్క్‌ వద్ద వ్యక్తి ఆత్మహత్య

మక్కా:ఈసారీ మిలియన్ల మంది హజ్‌ యాత్ర నిర్వహించారు. అయితే మక్కా గ్రాండ్‌ మసీద్‌ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మాస్క్‌ రూఫ్‌ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రెసిడెన్సీ ఆఫ్‌ టూ హోలీ మాస్క్స్‌ అధికార ప్రతినిథి అహ్మద్‌ బిన్‌ ముమమ్మద్‌ అల్‌ మన్సౌరీ మాట్లాడుతూ ఆత్మహత్య ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు పవిత్ర మక్కా మసీదు ప్రాంతంలో జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com