14 నెలల చిన్నారి పొట్ట నుంచి మ్యాగ్నెటిక్ బీడ్స్ తొలగింపు
- August 25, 2018
బహ్రెయిన్:తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు ఎస్‌ఎంసి ఎమర్జన్సీలో అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించారు. వివరాల్లోకి వెళితే సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్‌ఎంసి)కి ఓ బహ్రెయినీ బాలికను తీసుకొచ్చారు ఆమె తల్లిదండ్రులు. 14 నెలల బాలికను పరీక్షించిన కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ఫైజా హైదర్, ఆమె పొట్టలో ఓ వస్తువును గుర్తించారు. సర్జరీ చేసి, ఆ వస్తువును తొలగించారు. ఎక్స్‌రే ద్వారా ఆమె పొట్టలో మ్యాగ్నెటిక్ బీడ్స్ ఉన్నట్లు తెలుసుకున్నామని, అత్యంత జాగ్రత్తగా సర్జరీ నిర్వహించడం జరిగిందని ఎస్‌ఎంసి చీఫ్ సర్జన్ డాక్టర్ రాని అల్ అఘా చెప్పారు. ఇంట్లోంచి కొన్ని మ్యాగ్నెటిక్ బీడ్స్ గుర్తించినట్లు బాధితురాలి తల్లి తెలిపారు. అయితే వాటిని ఆమె ఎప్పుడు మింగేసిందో తనకు తెలియదని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







