ఫోటోగ్రాఫర్ అత్యుత్సాహం..

- August 25, 2018 , by Maagulf
ఫోటోగ్రాఫర్ అత్యుత్సాహం..

కోల్‌కత:అందరిలా ఫోటోలు ఎందుకు తీయాలి.. కొంచెం కొత్తగా ట్రైం చేద్దాం అనుకున్నాడో ఏమో కానీ ఓ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్ తీసిన ఫోటో అతడి ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది. కోల్‌కతకు చెందిన ప్రీతమ్ మిత్రా అనే ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఓ మోడలతో ఫోటోషూట్ నిర్వహించాడు. అయితే అతను అందరిలా కాకుండా రోటిన్‌కు కాస్త భిన్నంగా ఫోటో షూట్ చేశాడు. మోడల్‌ను పెళ్లికూతురిగా, బెంగాల్‌ స్టైల్‌లో పెద్ద బొట్టుతో అలంకరించి ఫోటోలు తీశాడు.. అయితే దీంట్లో తప్పు ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే అతని వైవిధ్యాన్ని కనబరిచాడు. పెళ్లికూతురు అలంకారంలో మోడల్‌ను న్యూడ్ ఫోటోలు తీశాడు.

ఆ మోడల్‌ ఎవరో తెలియకుండా కళ్లు మాత్రమే కనిపించేలా తమలపాకులతో ఫేసుని కవర్ చేశాడు. అలాగే ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ని జుట్టుతో, చేతిలో కుంకుమ భరణి పెట్టి కవర్ చేశాడు. అంతటితో ఆగలేదు ఈ ఫోటోగ్రాఫర్. తన ప్రతిభను నలుగురికీ చూపించలనుకున్నాడో ఏమో.. ఈ ఫోటోను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. న్యూడ్‌గా ఉన్న ఈ ఫోటో తన ఫేసుబుక్ పేజీలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వివాదంగా మారింది.

ఈ ఫొటో బెంగాల్‌ వివాహ వ్యవస్థను, హిందువులను అవమానపరిచేదిగా ఉందని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల్లో ఆ ఫొటోను.. ఫేస్‌బుక్‌ పేజీనుంచి తొలిగించకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని.. అలాగే అతని తలను తీసుకొచ్చినవారికి బహుమానం కూడా ఇస్తామని ప్రకటిస్తున్నారంటూ.. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు ఫోటోగ్రాఫర్ ప్రీతమ్.

ప్రస్తుతం ప్రీతమ్ తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. రొటీన్‌కి భిన్నంగా ఏదో చేద్దామని.. ఇంకేదో చేసి.. ఫోటోగ్రాఫర్‌ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు కానీ అది కాస్తా రివర్స్ అయిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com