ఇరాన్:బాయిలర్ పేలి 10 మంది మృతి
- August 25, 2018
ఇరాన్:బాయిలర్ పేలి పది మంది మృతి టెహ్రాన్: గ్యాస్‌తో నడిచే బాయిలర్ పేలడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇరాన్‌లోని మాషద్ నగరంలో జరిగింది. బాయిలర్ పేలడం వల్ల భవనమే ధ్వంసమైపోయిందని, దీంతో పది మంది చనిపోయారని అక్కడి మీడియా వెల్లడించింది. గ్యాస్‌తో నడిచే స్టోరేజి వాటర్ హీటర్ పేలడం వల్ల ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఇరాన్‌లో ఎక్కువగా ఈ తరహా బాయిలర్స్‌ను వినియోగిస్తుంటారు. గతంలో కూడా అవి పేలిన ఘటనలు ఉన్నాయి. గ్యాస్ లీకేజీ వల్ల ఎక్కువగా పేలుళ్లు జరుగుతుంటాయి. దేశ రాజధానికి దాదాపు 900కిలోమీటర్ల దూరంలో మాషద్ నగరంలో ఈరోజు ఉదయం పేలుడు జరిగినట్లు వైజేసీ.ఐఆర్ న్యూస్ అనే వెబ్‌సైట్ ప్రచురించింది. రెండస్తుల భవనంలో పేలుడు జరగడంతో అది కుప్పకూలినట్లు తెలిపింది. ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతిచెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలియలేదు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







