హైదరాబాద్:మారథాన్.. అంబులెన్స్‌నుకు ఓ రూల్.. పోలీసు బండికి ఓ రూల్ !
- August 25, 2018
హైదరాబాద్:ట్యాంక్‌బండ్ నుంచి గచ్చిబౌలి వరకూ మారథాన్ కోసం రోడ్డులు మూసేశారు. చివరికి అంబులెన్స్‌లకు సైతం దారి ఇవ్వలేదంటే పరుగు కోసం ఎలాంటి ఆంక్షలు అమలు చేశారో అర్థం చేసుకోవచ్చు. పోలీసు వాహనాలు మెయిన్ రోడ్డుపైకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కానీ అంబులెన్స్‌ను మాత్రం అడ్డుకున్నారు. అదేమంటే ట్రాఫిక్ రూలట! ప్రాణాలు కాపాడే అంబులెన్స్ కు దారి ఇవ్వటం కంటే మారథాన్ రన్నే మీకు ముఖ్యమా అని పోలీసులను కడిగి పారేశారు ప్రజలు.
“రన్నర్స్ మారథాన్ రన్” హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నెక్లెస్‌రోడ్-గచ్చిబౌలి స్టేడియం మధ్య 42 కిలో మీటర్ల మేర జరుగుతోంది. దాదాపు 20 వేల మంది పాల్గొంటారని అంచనా వేశారు. ఈ రన్ నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులకు తావు లేకుండా రెండు కమిషరేట్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్ కూడా పరిస్తితి ఎప్పటికప్పుడు సమీక్షించారు. తెల్లవారుజామున 4.30 నుంచి 9 గంటల వరకు హైదరాబాద్ పరిధిలో ఆంక్షలు పెట్టారు. సైబరాబాద్‌లో 12 వరకు ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్, లిబర్టీ, కవాడిగూడ చౌరస్తా, క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కావూరి హిల్స్, సైబర్ టవర్స్ జంక్షన్, బయోడైవర్శిటీ పార్క్, గచ్చిబౌలి జంక్షన్ వరకూ పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవడంతో జనం ఇబ్బంది పడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







