లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో రాహుల్‌ ప్రసంగం

- August 25, 2018 , by Maagulf
లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో రాహుల్‌ ప్రసంగం

లండన్‌: భారత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్ని బీజేపీ, ప్రతిపక్షాల ఐక్య కూటమి మధ్య పోరుగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌అభివర్ణించారు. దేశంలో తొలిసారిగా రాజ్యాంగ సంస్థలపై దాడులు జరుగుతున్నాయని, అందుకే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్నారు. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ శుక్రవారం రాత్రి లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో భారతీయ విద్యార్థులతో ముచ్చటించారు. బీజేపీని ఓడించడం, ప్రభుత్వ సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ జోక్యాన్ని అడ్డుకోవడమే కాంగ్రెస్‌ పార్టీ మొదటి ప్రాధాన్యమని చెప్పారు.  ‘వచ్చే ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష కూటమి మధ్య ముఖాముఖి పోరు తథ్యం’ అని అన్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని చెప్పారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com