ఫ్లోరిడాలో కాల్పులు... ముగ్గురు మృతి..
- August 26, 2018
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జాక్సన్‌విలేలో జరిగిన కాల్పుల ఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక అనుమానితుడు కూడా మృతిచెందాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారని, 11 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. కాగా జాక్సన్ విలె కార్యాలయం ఒక ట్వీట్‌లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపింది. 'ఈ కాల్పుల ఘటనలో చాలా మంది మృతి చెందారు. మరికొంతమందిని అక్కడి నుంచి తీసుకుపోయారు. సంఘటనా స్థలానికి అందరూ దూరంగా ఉండండి' అని పేర్కొంది. కాగా అక్కడి మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక వీడియో గేమ్ టోర్నమెంట్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలంలో మోహరించి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







