శొంఠి పొడి టీ... ఆ సమస్యకు భేషుగ్గా పనిచేస్తుంది... వెల్లుల్లి ఉపయోగాలు...
- August 26, 2018
నడుమునొప్పి చాలామంది మహిళలను ఇబ్బంది పెట్టే సమస్య. నడుము పట్టేయడం, ఆ భాగంలోని కండరాలు, ఎముకలు బలహీనపడడం, గర్భధారణ, ప్రసవం, గర్భాశయంలో సమస్యలు, ఫైబ్రాయిడ్లు వంటివి నడుము నొప్పులకు దారితీస్తుంటాయి. ఇలాంటి సమస్యలను తొలగించుకునేందుకు ఆయుర్వేదంలో చికిత్స ఉంది.
పీచు పదార్థం అధికంగా ఉంటే ఆకుకూరలు, కాయగూరలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా కడుపులో గ్యాస్ పెంచే సెనగలు, మసాలా పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. కూర్చునేటప్పుడు, నిలబడేటప్పుడు భంగిమ చాలా ముఖ్యం. వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి. కుర్చీలలో కూర్చున్నప్పుడు వంగినట్లు కూర్చోకూడదు.
ఒక కప్పు నువ్వుల నూనెలో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్‌ను కలుపుకుని నడుముకు రాసుకుంటే నొప్పి తగ్గుతుంది. శొంఠి కషాయంలో కొద్దిగా ఆముదం కలుపుకుని నడుముకు రాసుకుంటే కూడా నడుము నొప్పి తగ్గుతుంది. కప్పు నీళ్లలో కొద్దిగా మిరియాలు, లవంగాలు, శొంఠి పొడి వేసుకుని టీలా కాచుకోవాలి. ఈ టీను ప్రతిరోజూ నడుముకు రాసుకోవడం వలన నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని రోజుకు రెండు మార్లు నడుముకు రాసుకోవాలి. కొబ్బరి నూనెను వేడిచేసుకుని అందులో కొద్దిగా కర్పూరం వేసి కరిగించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నడుముకు మర్దనా చేసుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







