ఇరాన్ ఆర్థిక మంత్రిపై వేటు..
- August 26, 2018
టెహ్రాన్ : ఇరాన్ ఆర్థిక మంత్రి మసూద్ కర్బాసియన్ అభిశంసనకు గురయ్యారు. క్యాబినేట్ నుంచి ఇటీవల తొలగించబడిన మంత్రుల్లో ఆయన రెండో వ్యక్తి. అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి కర్బాసియ న్‌ను మంత్రి పదవి నుంచి తప్పించి నట్టు ఇరాన్ పార్లమెంట్ పేర్కొంది. ఆర్థిక మంత్రి అభిశంసనకు అను కూలంగా 137 ఓటింగ్ నమోదు చేయగా, 121 మంది వ్యతిరేకించారు. హస్సన్ రౌహానీ క్యాబినేట్‌లో అభిశంసనకు గురైన మంత్రుల్లో ఆయన రెండో వ్యక్తి. కార్మిక మంత్రి అలీ రబీని కూడా ఇదే తరహాలో మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇరాన్‌లో కొంతకాలంగా ద్రవ్యోల్బణం ఏర్పడింది. నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. దీనికి తోడుగా ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. మిత్ర దేశాలను కూడా ఈ ఒప్పందం నుంచి వైదొలగాలని ఒత్తిడి తెస్తోంది. ఇరాన్‌పై అమెరికా భారీ ఆంక్షలు మోపింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







