డబ్ల్యుపిఎస్ కింద 850 ఉద్యోగుల నమోదు
- December 16, 2015
అహ్లి బ్యాంక్ అతి త్వరలో పేరోల్ కార్డ్‌ని తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కార్డ్ 6000 ఖతారీ రియాల్స్ వరకూ వేతనాన్ని సంపాదించే ఉద్యోగులకు అందజేస్తారు. డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అహ్లిబ్యాంక్ ఆండ్రూ మెక్‌కెనిచీ మాట్లాడుతూ, ఈ కార్డ్ అన్ని ఏటీఎంల వద్ద, పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ వద్దా ఉపయోగించవచ్చనీ, వీసా లోగోతో కార్డులు రూపొందుతాయనీ, ఖతార్ మరియు ఓవర్‌సీస్‌లో వినియోగించుకోవచ్చని తెలిపారు. 850 మందికి పైగా ఉద్యోగులు ఈ కార్డ్ కోసం నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ 20 వేల లావాదేవీలు జరిగాయని ఆయన చెప్పారు. కొత్త విధానం ద్వారా సేఫ్ బ్యాంకింగ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చామని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







