యూఏఈ లో ఓనమ్ రద్దు: వెలవెలబోతున్న టన్నుల కొద్దీ పూలు
- August 27, 2018
యూఏఈ:యూఏఈలో పూల దుకాణాలు వెలవెలబోతున్నాయి వినియోగదారులు లేకపోవడంతో. కేరళలో వరదల కారణంగా విపరీతమైన నష్టం సంభవించడంతో యూఏఈలోని కేరళ సమాజం ఓనమ్ వేడుకలకు దూరంగా వుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎవరూ పూలు కొనేందుకు ముందుకు రావడంలేదు. పెరుమాల్ స్టోర్స్ అనే ఓ ఫ్లవర్ స్టోర్‌లో 3 టన్నుల పూలు వృధా అయ్యాయి. వాటిని వేస్ట్‌గా పారేయాల్సి వచ్చిందని పెరుమాల్ స్టోర్స్ అధినేత సుదాలైముత్తు పెరుమాల్ చెప్పారు. రోజెస్, మారీ గోల్డ్, హిబికస్, తులసి, లాంతన తదితర పూలను ఓనమ్ ఫెస్టివల్లో ప్రముఖంగా ఉపయోగిస్తారు. 'అతపోకలం' పేరుతో ఏర్పాటు చేసే పూల అమరిక ఓనమ్‌కి ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి యేడాదీ 15 టన్నులకు పైగా పూలను ఓనమ్ కోసం సిద్ధం చేస్తామనీ, ఈసారి ఆ పరిస్థితి లేదనీ, చివరి నిమిషంలో ఓనమ్ రద్దుపై ప్రకటన రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని పెరుమాల్ స్టోర్ అధిపతి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







