దుబాయ్‌లో 6 నెలల్లో 4 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు
- August 27, 2018
దుబాయ్:దుబాయ్‌లో 2018 తొలి అరు నెలల్లో కేవలం 4 మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. గడచిన మూడు ఏళ్ళలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. హ్యూమన్ ట్రాఫికింగ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సుల్తాన్ అల్ గమాల్ మాట్లాడుతూ, 13 మంది బాధితుల్ని రక్షించామనీ, 14 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశామని చెప్పారు. 2016లో ఇదే సమయానికి ఆరు కేసులు నమోదు కాగా, 10 మంది బాధితుల్ని రక్షించగా, 18 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 2017లో నాలుగు కేసులు నమోదు కాగా, 9 మంది బాధితుల్ని రక్షించి, 15 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చట్టాలు కఠినంగా అమలవుతుండడంతోనే ఈ మార్పు సాధ్యమయ్యిందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







