అమర్ అక్బర్ ఆంటోనీ ఫస్ట్ లుక్ రిలీజ్
- August 27, 2018
అమర్ అక్బర్ ఆంటోనీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. రవితేజ, ఇలియానా ఇందులో జంటగా నటిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో హీరో పాత్రను మూడు భిన్నమైన గెటప్స్ లో చూపించారు. ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. రవితేజ కూడా తొలిసారి తన కెరీర్ లో ఇలా భిన్నమైన కోణాలున్న పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనువైట్ల తన గత సినిమాలకు పూర్తిభిన్నంగా.. సరికొత్త జోనర్ లో అమర్ అక్బర్ ఆంటోనీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్, లయ, వెన్నెల కిషోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షెడ్యూల్ అమెరికాలోని న్యూయార్క్ లో జరుగుతుంది. సెప్టెంబర్ లో షూటింగ్ పూర్తి కానుంది. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. విజయ్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా అమర్ అక్బర్ ఆంటోనీ విడుదల కానుంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







