సిరియాకు మద్దతు కొనసాగిస్తాం:ఇరాన్
- August 27, 2018
టెహ్రాన్: సిరియాలో శాంతి భద్రతల మెరుగుదల కోసం తాము అక్కడి ప్రభుత్వానికి మద్దతును ఇకపై కూడా కొనసాగిస్తామని ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ హతామీ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య సహకారాన్ని మూడో దేశం నిర్ణయించజాలదని స్పష్టం చేశారు. సిరియాలో ఇరాన్ జోక్యం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఇజ్రాయిల్ తమ సరిహద్దుల వద్ద స్థావరం ఏర్పాటు చేసుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సిరియాలో రెండు రోజుల పర్యటనకు బయల్దేరుతున్న సమయంలో హతామీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పర్యటనలో ఆయన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ఇతర సీనియర్ నేతలతో భేటీ అవుతారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!