డార్లింగ్ కు నచ్చిన ‘పేపర్ బాయ్’..
- August 27, 2018
పేపర్ బాయ్ చిత్ర ట్రైలర్ కు తన ప్రశంసలు అందచేసాడు యంగ్ రెబల్ స్టార్.. బాహుబలి ప్రభాస్. ట్రైలర్ చూసిన తర్వాత కాసేపు చిత్రయూనిట్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ట్రైలర్ మరియు పాటలు లో మంచి విజువల్స్ కనిపిస్తున్నాయి. శోభన్ గారు నా కెరీర్ కు వర్షం సినిమాతో తొలి విజయాన్ని అందించారు.. అదే విధంగా ఇప్పుడు సంతోష్ కూడా విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. నా బిల్లా సినిమాకు పని చేసిన సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ అద్బుతంగా ఉంది. గీతాఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్ర హక్కుల్ని కొనడం మరో మంచి పరిణామం. సంపత్ నంది గారికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇతర నిర్మాతలకు కూడా నా విషెస్ తెలియజేస్తున్నాను అని తెలిపారు. ప్రభాస్ వచ్చి తమ చిత్రానికి విషెస్ తెలపడంతో పేపర్ బాయ్ చిత్రయూనిట్ ఆనందంలో తేలిపోతున్నారు. ఆగస్ట్ 31న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







