హైదరాబాద్:20వేల వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ..!
- August 27, 2018
హైదరాబాద్: 'ఎకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమలను పూజించండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి..' అన్న నినాదంతో జీహెచ్‌ఎంసీ మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ప్టాస్టిక్ నిషేధంపై కసరత్తు ప్రారంభించిన సంస్థ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో జల వనరులు కలుషిత మవుతున్నాయన్న అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 20వేల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని, ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేయడంతోపాటు, కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా పంపిణీ చేపడతామని కమిషనర్ దానకిషోర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!