మా సినిమాను అనవసరంగా కిల్‌ చేస్తున్నారు :హీరో జై

- August 28, 2018 , by Maagulf
మా సినిమాను అనవసరంగా కిల్‌ చేస్తున్నారు :హీరో జై

జై, రష్మీగౌతమ్‌ జంటగా యు అండ్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో ఎస్‌ జై ఫిలింస్‌ పతాకంపై జానీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అంతకు మించి’. ఈ చిత్రం గత శుక్రవారం ఆగస్ట్‌ 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే ‘అంతకు మించి’ చిత్రానికి తాను నిర్మాతననీ, అంతేకాకుండా హీరో జై తనవద్ద 50 లక్షలు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించలేదని, కాబట్టి సినిమా ప్రదర్శనను నిలిపి వేయాలని కృష్ణ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ‘అంతకు మించి’ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించిన కోర్టు హీరో జైకు నోటీసులు జారీ చేసింది. దీనిపై హీరో జై స్పందిస్తూ.. ‘కృష్ణ అనే అతను మొదట ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు అయితే ఎవరికీ ఏ అడ్వాన్సులు కూడా ఇవ్వకుండా మీడిల్ డ్రాప్ అయ్యాడు. దాంతో సినిమా భారం నాపై పడింది. దాంతో నేను స్వయంగా కష్టపడి ఈ సినిమాను నిర్మించాను. అందరి దగ్గరనుంచి క్లియరెన్స్ తెచ్చుకున్న తరువాతే సినిమాను 24న 300 థియేటర్లలో విడుదల చేశాను. హిట్ టాక్ రావడంతో భరించలేక కృష్ణ అనే వ్యక్తి కావాలనే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి సినిమాను కిల్ చేస్తున్నాడు’ కానీ కోర్టు ఆదేశాలతో సినిమా నడుస్తుందని హీరో కం నిర్మాత అయిన జై అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com