ఇండియా:ఆరు వేల స్టేషన్లలో వైఫై సౌకర్యం
- August 28, 2018
న్యూఢిల్లీ: త్వరలోనే దేశ వ్యాప్తంగా ఆరు వేల రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం తెలిపారు. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వివరించారు.
'దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించడం వల్ల ప్రయాణికులకులతో పాటు వ్యవసాయ పనులు చేసే వారికి, ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద'న్నారు. అంతే కాకుండా విద్యార్థులకు, రైతులకు, ఉద్యోగాలు చేసే మహిళలకు కూడా ఎంతో ఉపయోగకరమని అన్నారు.'
దీనితో పాటుగా త్వరలోనే విమానాల మాదిరిగా రైల్వే కోచ్‌లలో కూడా బయో వ్యాక్యుమ్ టాయిలెట్లను అమర్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. రైల్వే హెల్ప్ లైన్ సర్వీస్‌ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని కాకపోతే దానిని కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే ట్రాకులను పునరుద్ధరించడానికి ప్రతిపాదనలు జరిగాయని అన్నారు. ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకొని ఎన్డీయే ప్రభుత్వం ఈ నిర్ణయాలను అమలు చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







